Fire Accident In Rangareddy District : రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో ఓ భవనంలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఓ రెండస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మంటల్లో ఇద్దరు చిన్నారులు చిక్కుకున్నారు. భవనంలో చిన్నారులను తాళ్ల సాయంతో స్థానికులు కిందికి దించారు. ఈ ఘటనపై సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు.
Category
🗞
News