• 2 hours ago
SLBC TUNNEL RESCUE OPERATION : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (ఎస్‌ఎల్‌బీసీ)లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో కీలక పురోగతి కనిపించింది. ఎస్​ఎల్​బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారి ఆచూకీని గుర్తించేందుకు అధికారులు పలు విధాలా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రౌండ్‌ పెనిట్రేటింగ్‌ రాడార్‌ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్‌ చేస్తుండగా 5 చోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు స్కానింగ్‌లో గుర్తించారు. టీబీఎం ముందు భాగం, దెబ్బతిన్న భాగంలో 5 మెత్తని భాగాలను గుర్తించారు. దీంతో చిక్కుకుపోయిన వారు అక్కడే ఉన్నట్లుగా సహాయక సిబ్బంది అనుకుంటున్నారు.

Category

🗞
News

Recommended