• 17 hours ago
ఎస్​ఎల్​బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు మరింత ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్​ఎఫ్​, హైడ్రా, సింగరేణి, రైల్వే సహా 12 సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గ్యాస్, ప్లాస్మా కటింగ్ యంత్రాలతో టీబీఎం శిథిలాలను కటింగ్ చేస్తున్నారు. దశల వారీగా బృందాలు వెళ్తూ శిథిలాలను బయటకు తెస్తున్నారు. గురువారం లోపలికి వెళ్లిన ఐదు బృందాలు అక్కడ పేరుకున్న 6 వేల క్యూబిక్‌ మీటర్ల పూడికను తొలగించారు. విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ నేతృత్వంలో సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. ఎప్పటికపప్పుడు సమావేశం నిర్వహిస్తూ కావల్సిన పరికరాలు, యంత్రాలు సహా నిపుణులను రప్పిస్తున్నారు.

సొరంగంలో చేపట్టిన సహాయ చర్యల్లో పాల్గొన్న సింగరేణి రెస్క్యూ సిబ్బందిని సీఎండీ బ‌ల‌రామ్‌ ప్రశంసించారు. భూగ‌ర్భంలో ప్రమాదాల స‌మ‌యంలో స‌హాయ చ‌ర్యల్లో సుశిక్షితులైన సింగ‌రేణి సిబ్బంది పాల్గొంటారని అటువంటి వారిని మరో 200 మందిని పంపించాలని సింగరేణికి ఆదేశాలు జారీ చేశారు. అత్యాధునిక స‌హాయ సామ‌గ్రితో పాటు రాష్ట్ర, కేంద్ర స‌హాయ‌క సిబ్బందితో స‌మ‌న్వయం చేసుకుంటూ సొరంగంలో చిక్కుకున్న వాళ్లను క్షేమంగా తీసుకురావాలన్నారు.

Category

🗞
News

Recommended