Skip to playerSkip to main contentSkip to footer
  • 12/22/2017
Hyderabad recorded 10.8 degrees Celsius on Wednesday, the coldest day in the last six years.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదును చలిపులి వణికిస్తోంది. గత ఆరేళ్ల కాలంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రత హైదరాబాదులో ఎప్పుడూ నమోదు కాలేదు. బుధవారంనాడు హైదరాబాదులో 10.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే నాలుగైద రోజులు ప్రయాణికులు జాతీయ రహదారులపై అప్రమత్తంగా వ్యవహరించాలని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు హెచ్చరించారు. పొగమంచు కళ్లు గప్పే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఆదిలాబాద్ జిల్లా కాశ్మీర్‌ను తలపిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో, హైదరాబాద్ సహా చలి గాలులు వీస్తున్నాయి. ఖమ్మం, భద్రాచలం, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో చలి గాలులు భీతి గొల్పుతున్నాయి.

Category

🗞
News

Recommended