Skip to playerSkip to main contentSkip to footer
  • 10/30/2017
Rowdy sheeter Basavala Vasu lost life in guntur town on Sunday night.
గుంటూరు పట్టణం ఆరండల్ పేట లో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైయ్యారు. నిత్యం రద్దీగా ఉండే ఆరండల్ పేట 12 వ లైన్ లో ఓ రెస్టారెంట్ లో భోజనం చేసి బయటకు వచ్చిన మృతుడు బసవల వాసు ని దుండగులు పధకం ప్రకారం హత్య చేశారు. గుంటూరు నగరం లో ఈ హత్య కలకలం రేపుతుంది. స్కార్పియో వాహనం లో వచ్చిన దుండగులు చాలా కసిగా కొడవళ్ళతో వాసును హతమార్చారు. కసితీరా నరికారు. మొత్తం 5గురు దుండగులు విచక్షణా రహితం గా ఒళ్లంత తూట్లు తూట్లు గా నరికివేశారు. వాసు మృతదేహం పై మొత్తం 40 గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విద్యానగర్ కి చెందిన మృతుడు వాసు గతంలో గుంటూరు కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకి అనుచరుడుగా ఉండేవాడు. ప్రత్యర్ధులు ఇతని సోదరుడిని 2004 లో హత్య చేశారు. మృతుడు వాసు సోదరుడిని చంపిన వారిని హత్య చేసిన కేసులో వాసు వాసుపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. హత్య జరిగిన రెస్టారెంట్ నుండి పోలీసులు సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. పోలీసులు కొందరు ఆనుమానితులను అదువులోకి తీసుకోని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పాతకక్ష్యల నేపధ్యం లో పాత గుంటూరు హత్యకు సంభందించిన వాళ్ళా... లేక గతం లో మాజీ ఎమ్మెల్యే వద్ద సెటిల్ మెంట్ వ్యవహారాలకు సంభందించి హత్య జరిగిఉంటుందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Category

🗞
News

Recommended