Skip to playerSkip to main contentSkip to footer
  • 2/16/2018
Hero Nani became a producer for Awe! movie. This movie Released on August 16th. here are the reasons Why you need to watch the film

తెలుగు సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటుడిగా మారారు హీరో నాని. ఆ తర్వాత వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నాని నిర్మాతగా మారి అ! అనే చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్రవరి 16న విడుదలయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
బాల్యంలోనే లైంగిక వేధింపులకు గురైన కాళి (కాజల్ అగర్వాల్) మానసిక క్షోభకు గురవుతుంది. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతుంది. తన జీవిత ప్రయాణంలో అనేక వ్యక్తులతో ట్రావెల్ అవుతుంది. సూసైడ్ చేసుకోవడానికి డిసైడ్ అవుతుంది. అలా మానసిక క్షోభకు గురైన కాజల్ జీవితానికి ముగింపు ఏమిటనేది అ! చిత్ర కథ.
అ! మూవీ కథలో చెఫ్ (ప్రియదర్శి), హోటల్ యజమాని (ప్రగతి), హోటల్‌లో పనిచేసే బేరర్ (రెజీనా కసండ్రా), హోటల్‌కు వచ్చిన పిల్లతో ఛాలెంజ్‌కు దిగిన మెజిషియన్ (మురళీశర్మ), టైమ్ మిషిన్ తయారు చేసి తల్లిదండ్రులను కలుసుకోవాలనే సైంటిస్టు (అవసరాల శ్రీనివాస్), లైంగిక వేధింపులకు గురై పురుషులంటే అసహ్యభావం పెంచుకొన్న ఇషా రెబ్బా మానసిక వైద్యురాలు కృష్ణవేణి (నిత్యమీనన్‌)తో ప్రేమలో పడటం ఇలాంటి క్యారక్లర్లు కథలో భాగమవుతాయి. ఆ రెస్టారెంట్‌లో జరిగిన సన్నివేశాలు కాజల్ అగర్వాల్ జీవితానికి ఎలా ముడిపడ్డాయి? అనేది తెర మీద పాత్రలు చేసే మ్యాజిక్ అ! చిత్రం.
పాత్రలు, కొత్తదనం కనిపించే స్క్రిప్ట్‌తో రూపొందిన కాన్సెప్ట్ చిత్రం అ!. ఒక్కపాత్ర జర్నీ ఒక్కో ఎపిసోడ్‌గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తీరు ప్రశంసనీయం. కాకపోతే సగటు ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా ఉండటం అ! చిత్రంలో ఓ లోపం
ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయంతో ఆరంభమై చివరకు ఆ పాత్రలను కనెక్ట్ చేస్తూ ఇంటర్వెల్‌ బ్యాంగ్ వేయడం ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా మొదటి భాగంలో ప్రియదర్శి, చేప (నాని) మధ్య జరిగే సన్నివేశాలు సరదాగా సాగుతాయి. అయితే మిగితా ఎపిసోడ్స్ అంతగా ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉండకపోవడం కొంత ఇబ్బందికి గురిచేస్తుంది.
రెండో భాగంలో మెజిషియన్ మురళీశర్మ ఎపిసోడ్ కాస్తా కాలక్షేపంగా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి కథ వేగం పుంజుకొని ప్రేక్షకుడిలో ఆసక్తిని రేపుతుంది. అయితే క్లైమాక్స్‌లో ప్రధాన పాయింట్‌ను ఆదరాబాదరాగా ముగించే ప్రయత్నం కనిపించింది. అయితే ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం బాగా ఉందనిపించినా క్లారిటీ మిస్ కావడం, కథలో కన్‌ఫ్యూజన్ ప్రేక్షకుడి బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది

Recommended