Visakha Skater Won Three Gold Medal In Taiwan Artistic Skating Championship : విశాఖకు చెందిన ఆర్టిస్టిక్ స్కేటర్ దొంతారా గ్రీష్మ తైవాన్‌లో జరిగిన ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 3 స్వర్ణపతకాలు సాధించింది. విశాఖ వ్యాలీ స్కూల్‌లో ప్లస్ టూ చదువుతున్న 16 ఏళ్ల గ్రీష్మ ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు తైవాన్‌లో జరిగిన ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంది. పెయిర్, పెయిర్ డ్యాన్స్, క్వార్టెట్ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు కైవసం చేసుకుంది.
Category
🗞
News