Pawan Kalyan Meeting With CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సహా వివిధ అంశాలపై గంటపాటు ఇద్దరూ చర్చించారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై కొద్దిసేపు చర్చించారు. ఎన్నికలు జరగనున్న ఐదు స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఖరారు చేశారు. రాష్ట్ర బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయింపులపై పవన్ తన అభిప్రాయాలు చెప్పారు. బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సమతూకంతో నిధులు కేటాయించారని పేర్కొన్నారు.
Category
🗞
News