SIT on Govindappa Balaji Liquor Scam : వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో గోవిందప్ప బాలాజీనే ప్రత్యేక నెట్ వర్క్ ఏర్పాటు చేశారని సిట్ తేల్చింది. సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం ప్రత్యేక వ్యవస్థను గోవిందప్ప బాలాజీయే రూపొందించినట్లు రిమాండ్ రిపోర్డులో వెల్లడించింది. బాలాజీ తరచూ రాజ్ కెసిరెడ్డి కార్యాలయానికి వెళ్తూ కీలక వ్యక్తుల సందేశాన్ని చేరవేసేవారని వసూలు చేసిన సొమ్మును తన వాహనాల్లోనే తీసుకెళ్లేవారని సిట్ నిర్ధారించింది. అక్రమంగా పోగేసిన సొత్తుతో భారీగా ఆస్తులు, ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.
Category
🗞
News