Skip to playerSkip to main contentSkip to footer
  • 12/15/2017
Telugu comedian Vijay sai's wife vanitha Reddy went into under ground. PHONE conversation of wife and husband out

హాస్య నటుడు విజయ్‌సాయి ఆత్మహత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన భార్య వనిత రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కుటుంబ తగాదాలపై పలు ఆరోపణలు వినిపిస్తుండడంతో పోలీసులు ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.విజయ్‌సాయి ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో స్పష్టంగా లేదు. దీంతో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. వనితా రెడ్డిపై రెండు కేసులు నమోదయ్యాయి.
విజయ్ ఇంటికి నలుగురితో వచ్చి వనితా రెడ్డి కారు తీసుకువెళ్లినట్లు ఒక కేసు నమోదు కాగా, విజయ్ ఆత్మహత్యకు కారణమని మరో కేసు వనితా రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లోనూ వనితా రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. దీంతోనే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
విజయ్ ఆత్మహత్య చేసుకోక ముందు తన భార్య వనితతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో సంభాషణ వెలుగు చూసింది. అందులో విజయ్ తన భార్య వనితను చివరి కోరికను కోరినట్టు స్పష్టంగా ఉంది. వనితతో ఈ ఫోన్ సంభాషణ సమయంలోనే విజయ్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు దాన్ని బట్టి తెలుస్తోంది.

Category

🗞
News

Recommended