Miss World Contestants in Warangal : కాకతీయుల కళా వైభవానికి ప్రపంచ ముద్దుగుమ్మలు ఫిదా అయ్యారు. మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా ఓరుగల్లుకు చేరుకున్న అందాల భామలు రామప్ప, వేయి స్తంభాల గుడిని సందర్శించారు. చూపుతిప్పనివ్వని రామప్ప శిల్పాల హోయలకు ముగ్దులయ్యారు. వేయి స్తంభాల ఆలయమంతా కలియ తిరిగిన సుందరీమణులు నిర్మాణ నైపుణ్యానికి ఆశ్చర్యపోయారు. సంప్రదాయ దుస్తుల్లో హాజరైన ముద్దుగుమ్మలు ఇరు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
Category
🗞
News