Vontimitta Brahmotsavam Fifth Day 2025 : ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదో రోజు వైభవంగా జరుగుతున్నాయి. మోహినీ అలంకారంలోఉన్న రాములవారు మాఢ వీధుల్లో విహరిస్తూ జగన్మోహనాకారుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వాహన సేవలో పాల్గొన్న భక్తులు పరవశానికి లోనయ్యారు. కర్పూర హారతులతో స్వామివారిని ప్రార్థించారు.
Category
🗞
NewsTranscript
00:00.