CM Revanth Reddy Inaugurated Young India Police School : గత ముఖ్యమంత్రులకు రైతు సంక్షేమం, ఐటీ ఇలా వేరువేరు బ్రాండ్లు ఉండొచ్చు కానీ తన బ్రాండ్ మాత్రం ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసుల పిల్లల కోసం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖతో తనకు ఆప్యాయ బంధముందన్న సీఎం, వారి పిల్లల విద్య పట్ల స్పష్టమైన వైఖరి ఉందని తెలిపారు.
భారతదేశంలోని యువత ప్రపంచ స్థాయిలో సగర్వంగా నిలబడాలనేదే తన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. అందులో తెలంగాణ వారు ముందుండాలని ఆకాంక్షించారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ ప్రభుత్వం కంకణబద్ధమై ఉందన్న ముఖ్యమంత్రి, సైనిక్ స్కూల్, ఆర్మీ స్కూల్‌తో పోటీ పడే విధంగా పోలీస్ స్కూల్ తయారవ్వాలని సూచించారు. అందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. నగరంలోని ఐటీ, ఫార్మా కంపెనీల నుంచి సీఎస్ఆర్ నిధులు సేకరించాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.
ఈ పాఠశాల నిర్మాణం సీఎం సూచన మేరకు యుద్ధ ప్రాతిపదికన జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు. పాఠశాల నిర్మాణం నుంచి పిల్లల యూనిఫామ్ వరకు ప్రతిదాంట్లో సీఎం ప్రత్యేక చొరవ చూపించారని డీజీపీ జితేందర్, నగర కమిషనర్ సీవీ ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్లతో కలిసి సీఎం పాఠశాల భవనాన్ని కలియ తిరిగి పరిశీలించారు. అనంతరం సరదాగా విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడి సందడి చేశారు.

Category
🗞
NewsTranscript
00:00What