• 2 days ago
Three Bears Roaming in Sathya Sai District : శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆలయంలో ఎలుగుబంట్లు హల్​చల్ చేశాయి. రొళ్ల మండలం జీర్గేపల్లి గ్రామంలో స్వారక్క, గ్యారక్క, ముడుపక్క త్రిమూర్తి అమ్మవార్ల దేవాలయంలోకి అర్ధరాత్రి మూడు ఎలుగుబంట్లు ప్రవేశించాయి. ఈ దృశ్యాలు ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆలయంలో భక్తులు లేని సమయంలో ఎలుగుబంట్లు రావడంతో ఎలాంటి హాని జరగలేదు. ఈ గ్రామానికి ఆనుకొని అటవీ ప్రాంతం ఉంది. దీంతో ఆలయంలో అమ్మవార్లకు నైవేద్యంగా పెట్టిన పండ్లను తినేందుకు తరచుగా ఎలుగుబంట్లు ఆలయంలోకి వస్తుంటాయని స్థానికులు తెలిపారు.

Category

🗞
News
Transcript
00:00♪♪
00:10♪♪
00:20♪♪
00:30♪♪
00:40♪♪
00:50♪♪
01:00♪♪

Recommended