Nara Bhuvaneswari Kuppam Tour on Fourth Day : రాష్ట్రంలోని మహిళలందరూ ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని మహాశక్తిగా ఎదగాలని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఆమె శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించారు. నక్కనపల్లి గ్రామంలో సెరికల్చర్ సాగు పట్టు పరిశ్రమను సందర్శించారు. పట్టు రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని ప్రసన్న గంగమాంబ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.
Category
🗞
News