• 2 days ago
Rare Animal in Forest : తెలంగాణ-ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల సరిహద్దు నూగూరు అభయారణ్యంలో అరుదైన జంతువును అటవీశాఖ అధికారులు గుర్తించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెంవారి మధ్యతరహా జలాశయానికి దాదాపు కి.మీ. దూరంలో అడవిలో కార్చిచ్చు ఏర్పడింది. ఈ మంటలను ఆర్పేందుకు సెక్షన్​ అధికారి దేవయ్య, ఎఫ్​బీవోలు ప్రణవి, సరళ, బేస్​ క్యాంపు బృందం అడవిలోకి వెళ్లారు.

అక్కడ మార్గమధ్యలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో ఓ అరుదైన జంతువు చిక్కుకున్నట్లు గుర్తించారు. ఆ జంతువును రక్షించే క్రమంలో ఎదురు దాడికి దిగింది. అయినాసరే ఎలాంటి పొరపాటు చేయకుండా చాకచక్యంగా దాన్ని కాపాడారు. వెంటనే అది అభయారణ్యంలోకి పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను అటవీ శాఖ అధికారులు విడుదల చేశారు.

రేంజి అధికారి వంశీకృష్ణ మాట్లాడుతూ, ఈ జంతువు ఆఫ్రికా, దక్షిణ-పశ్చిమ ఆసియా, భారతీయ ఉపఖండంలో కనిపించే హనీబ్యాడ్జర్​ అని చెప్పారు. దీనినే రాటిల్, తేనెకుక్కగా పిలుస్తారని తెలిపారు. ఈ ప్రాంతంలో కనిపించడం ఇది మొదటిసారిగా వివరించారు. ఇది మాంసాహార జంతువని, తేనెతీగల నుంచి వచ్చే లార్వాను ఇష్టంగా తింటుందని అన్నారు. పులి, చిరుత వంటి క్రూర జంతువులను సైతం ధైర్యంగా ఎదుర్కొని నిలుస్తోందన్నారు. ఈ హనీ బ్యాడ్జర్​ 55 నుంచి 77 సెంటీమీటర్ల పొడవుతో సుమారు 16 కేజీల వరకు ఉంటుందన్నారు. ఎలుగుబంటి ఆకారాన్ని పోలి ఉండే ఈ జంతువు చర్మం ఎలాస్టిక్​ మాదిరి సాగుతుందని చెప్పారు.

Category

🗞
News
Transcript
02:00I'll see you next time.

Recommended