Intermediate Bord Exams Today : రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. సుమారు 15వందలకు పైగా కేంద్రాల్లో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వనున్నట్టు బోర్డు ప్రకటించింది. ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్న బోర్డు విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించింది.
Category
🗞
News