Skip to playerSkip to main contentSkip to footer
  • 8/25/2018
కేరళ రాష్ట్రం వరదల ధాటికి తుడుచుపెట్టుకుపోయింది. గత వందేళ్లలో ఎన్నడూ చూడని భారీ విపత్తుకు కేరళ తల్లడిల్లింది. ఎంతో మంది కేరళను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే యూఏఈ రూ.700 కోట్లు సహాయం చేస్తామని ముందుకు వచ్చింది. అయితే కొన్ని నియమనిబంధనలతో భారత ప్రభుత్వం ఆ సహాయన్ని నిరాకరించింది. ఆ తర్వాత కేరళకు నగదు రూపంలో ఎంత సహాయం చేస్తామని చెప్పలేదంటూ యూఏఈ ప్రభుత్వం తెలిపింది. ఇంత గందరగోళ నడుమ... యూఏఈకి చెందిన ప్రముఖ విమానాయాన సంస్థ ఎమిరేట్స్ కేరళకు ఆపన్న హస్తం ఇస్తామంటూ ముందుకొచ్చింది. వరద బాధితులను ఆదుకునేందుకు 175 టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ను కేరళకు తరలిస్తామంటూ ప్రకటించింది.

Category

🗞
News

Recommended