Skip to playerSkip to main contentSkip to footer
  • 1/27/2018
Director Ramgopal Varma's latest flick 'GST' creating a new sensation in Indian digital cinema. RGV tweeted a woman response after watching GST today.

'జీఎస్‌టీ' (గాడ్,సెక్స్&ట్రూత్) చిత్రంపై ఓవైపు మహిళ సంఘాల ఆందోళనలు కొనసాగుతుంటే..మరోవైపు కొంతమంది మహిళల నుంచి మాత్రం వర్మకు మద్దతు లభిస్తుండటం గమనార్హం. నేటి ఉదయం 9గం.కు సినిమా విడుదలవడంతో.. కొంతమంది మహిళలు కూడా ఈ చిత్రాన్ని చూసినట్లు తెలుస్తోంది. చూడటమే కాదు.. వర్మకు మద్దతునిస్తూ ఆయనకు మెసేజ్‌లు కూడా పెట్టారట. ఈ విషయాన్ని ఆర్జీవి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు..
గాడ్ సెక్స్&ట్రూత్ చూసిన తర్వాత ఓ మహిళ ఇలా మెసేజ్ చేసిందంటూ వర్మ దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 'ప్రతీ సీన్ వణుకుపుట్టించేలా ఉంది. ఇది పోర్న్ కాదు, ఫిలాసఫీ అంతకన్నా కాదు.. స్త్రీ శరీరంలోని ప్రతీ భాగాన్ని శృంగారపరమైన ఆధ్యాత్మికతతో కూడిన పవిత్ర పద్దతిలో ఆరాధించడం' అని అందులో సదరు మహిళ పేర్కొనడం గమనార్హం.
'ఓ బాలికగా సామాజిక కట్టుబాట్లు, నైతిక విలువల వల్ల నేను అణ‌చివేత‌కు గుర‌య్యాను. కానీ జీఎస్‌టీ చూసిన త‌ర్వాత దేవుడు న‌న్ను మ‌హిళ‌గా పుట్టించినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాను. మ‌హిళ శృంగార స్వేచ్ఛ గురించి చెప్పిన విధానం నాకు న‌చ్చింది. నా శృంగార హ‌క్కుల గురించి ఆలోచించేలా చేసింది. వ‌ర్మ‌కి, మియా మాల్కోవాకి ధ‌న్య‌వాదాలు' అని మరో మహిళ తనకు మెసేజ్ చేసినట్లు ఆర్జీవి ట్వీట్ చేశారు.
మియా మాల్కోవాతో 'గాడ్ సెక్స్&ట్రూత్'ను తెరకెక్కించడంలో ఉన్న అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకుని తనను అభినందిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వర్మ తెలిపారు. ఈ సినిమా చూసిన ప్రతీ మహిళ.. తప్పకుండా దీన్ని ప్రేమిస్తుందని, అలాగే స్త్రీ అందాన్ని తాను ఎంతలా గౌరవిస్తానో అర్థం చేసుకుంటుందని పేర్కొన్నారు.

Recommended