Skip to playerSkip to main contentSkip to footer
  • 1/22/2018
Sunny Leone's recent interview has become a hot topic. Sunny said she is going to start cosmetic business in soon.

'అదే పనిగా దేవున్ని చూస్తూ కూర్చుంటే బోర్ కొడుతుందేమో గానీ.. సన్నీ లియోన్‌ను చూడమంటే ఎన్ని గంటలైనా చూస్తారు..కేరళలో ఆమెకు లభించిన స్పందన చూసిన మొత్తం దేశమే ఆశ్చర్యపోయింది. తన అందంతో భారతీయుల్ని అంతలా ఆకట్టుకుంటోంది సన్నీ లియోన్. తాజాగా 'సన్నీ కా హంగామా' అనే కార్యక్రమంలో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు..
ఫిట్‌నెస్‌ సీక్రెట్? రోజూ మా వారు డేనియల్‌ వెబర్‌తో కలిసి జిమ్‌కి వెళ్తాను. కచ్చితంగా గంట నుంచి గంటన్నర పాటు జిమ్ చేస్తాను.
ఇండియా వచ్చిన మొదట్లో మీ ఫీలింగ్? నేను ఇక్కడో అతిథిని. ఇక్కడే ఉండిపోదామనుకుంటున్నా..
బెంగళూరు న్యూ ఇయర్ షో రద్దు వెనుక? తెలియదు. కానీ ఆ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది. ఈవెంట్‌ పబ్లిసిటీ కోసం 15 ఏళ్ల క్రితం నాటి నా ఫోటోల్ని వాడారు. అయినా అలాంటి ఈవెంట్‌లో పాల్గొనేంత సెలబ్రిటీని కాదు. ఆ వివాదం టైమ్ లో మీడియా నాకు మద్దతుగా నిలిచింది. మనమెంత సున్నితంగా మాట్లాడితే ప్రేక్షకులు మనం చెప్పేది అంతలా రిసీవ్ చేసుకుంటారు.
సెక్స్‌ ఎడ్యుకేషన్‌ విషయంలో తల్లిదండ్రులదే బాధ్యత. కేవలం టీచర్స్ చెప్పే పాఠ్యాంశాల వల్ల అది సాధ్యం కాదు. ఈ విషయంలో ఇద్దరు మహిళలు నాకు వ్యతిరేకంగా డిబేట్‌లో పాల్గొన్న వీడియోను చూశాను.
ఇలాంటి సందర్భాల్లో గట్టిగా బదులివ్వాలనిపిస్తుంది. కానీ చెప్తే ఏమవుతుందోనన్న భయంతో మాటలు గొంతులోనే ఆగిపోతున్నాయి. అయినా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే అరిచి చెప్పాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం
మీ అమ్మాయి గురించి ? పేరు నిషా కౌర్ వెబర్‌. తనొచ్చాక మా జీవితమే మారిపోయింది.

Recommended