Skip to playerSkip to main contentSkip to footer
  • 6/6/2018

ఇటీవల విడుదలైన నీట్ పరీక్షల్లో మంచి ర్యాంకు రాలేదనే కారణంతో జస్లీన్ కౌర్ అనే 18 ఏళ్ల యువతి అబిడ్స్‌లోని పదంతస్తుల భవంతి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఈ ఆత్మహత్య కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అందరూ చూస్తుండగా, వద్దని ఎంతోమంది వారిస్తున్నా ఆమె వినకుండా దూకేసింది. కొందరు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. జస్లీన్‌ కౌర్‌ తల్లిదండ్రులు రణ్‌వీర్‌ సింగ్‌, లవ్లీసింగ్‌లు. వీరి కుటుంబం బర్కత్‌పురలోని ఖైబాన్‌ అపార్టుమెంట్‌లో ఉంటోంది. జస్లీన్‌కు ఇంటర్‌లో 950 మార్కులు వచ్చాయి. మెడిసిన్ చదవాలనుకుంది. నీట్‌లో లక్ష కంటే ఎక్కువ ర్యాంకు రావడంతో ఆ అవకాశాన్ని కోల్పోయింది. సోమవారం ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి బాధతోనే ఉంది. మంగళవారం ఉదయం జిమ్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి స్కూటీలో బయటకు వచ్చింది. ఉదయం పది గంటల సమయంలో అబిడ్స్‌లోని మయూర్ కుషాల్ కాంప్లెక్స్ వద్దకు వచ్చింది.

Category

🗞
News

Recommended