Skip to playerSkip to main contentSkip to footer
  • 1/8/2018
A woman lost life and two others sustained injuries in a road mishap after a motorist suspected to be in an inebriated condition rammed into their bike here on Saturday night.

పీకల దాకా మద్యం తాగి, ఆ మత్తులో ఓ యువతి ప్రాణాలను బలిగొనడంతో పాటు, మరో ఇద్దరు యువతుల ప్రమాదానికి కారణమయ్యాడు విష్ణువర్ధన్ అనే వ్యక్తి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకటి రెండు గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో మస్తానీ అనే యువతి చనిపోయింది. ప్రియ, అనుష అనే యువతులకు గాయాలయ్యాయి. ఇందులో ఒకరు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. విష్ణువర్ధన్ మద్యం తప్పతాగి వాహనం నడపడం వల్ల మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. మృతి చెందిన మస్తానీ జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పలు సినిమాల్లో నటించింది.
మస్తానీ, ప్రియ, అనూషలు కూకట్‌పల్లి నుంచి జేఎన్‌టీయూ, మాదాపూర్ మీదుగా యూసఫ్‌గూడ బయలుదేరారు. వారు మరో పది నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటారని అనుకుంటుండగా ఘోరం జరిగింది. వీరు వెళ్తున్న స్కూటీని విష్ణు కారు బలంగా ఢీకొట్టడంతో అదే వేగంతో దూసుకెళ్లి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. మస్తాని మృతి చెందగా, అనూష అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

Category

🗞
News

Recommended