Skip to playerSkip to main contentSkip to footer
  • 12/27/2017
Road Mishap In Guntur District. Tipper lorry hits bike. Watch Video

గుంటూరు జిల్లా కోటప్పకొండ వద్ద ఈరోజు ఉదయం ఘోర రోడ్దు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా తంగెడుమల్లి గ్రామానికి చెందిన ఆర్ యం పి వైధ్యుడు విప్పర్ల.శ్రీనివాసరావు(45) అతని భార్య రామాంజమ్మ(38)లు వారి ఒక్కగానొక్క కుమార్తె , నరసరావుపేట పట్టణంలో ని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మహిమ(15) బైక్ పై వెళ్తున్నారు. కాగా క్రిస్ట్మస్ సెలవలు ముగించుకున్న మహిమను హాస్టల్ లో దిగబెట్టేందుకు దంపతులు పాపతో కలిసి ద్విచక్ర వాహనం పై నరసరావుపేట వెళుతుండగా మితిమీరిన వేగంతో ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ వారిమీదకు దూసుకు పోయింది.

ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు దంపతులు ప్రమాదస్థలంలోనే మృతి చెందగా వారి కుమార్తె మహిమ తీవ్రగాయాలతో ప్రమాదం నుండి బయట పడింది. వెంటనే మహిమను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సను అందచేశారు. కానీ మహిమ ప్రాణాపాయం నుండి బయట పడినా తల్లి తండ్రుల కోసం ఆ పాప రోదనలు ఆకాశాన్ని మిన్నంటాయి.

అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండే డాక్టర్ కుటుంబం ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.అతన్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శాక్షించాలని గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. నరసరావుపేట రూరల్ ఎస్ ఐ కె బ్రహ్మం సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.


Category

🗞
News

Recommended