Skip to playerSkip to main contentSkip to footer
  • 1/2/2018
Akkineni Nagarjuna is mostly known for being the fittest actors of Telugu Cinema. His new look creates social media frenzy.
సినిమాల్లో కొన్ని కాంబినేషన్స్ పట్ల ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో నాగ్-వర్మ కాంబినేషన్ మరింత స్పెషల్. 28ఏళ్ల క్రితం 'శివ'తో వీరిద్దరు చేసిన మ్యాజిక్ ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. కాబట్టే.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా కోసం అంతే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
వర్మకు నాగ్ అంటే ముందు నుంచి స్పెషల్ ఇంటెన్షన్ అనే చెప్పాలి. ఆయన ఎవరిని గౌరవించినా.. గౌరవించకపోయినా నాగ్‌ను మాత్రం ఎప్పుడూ పల్లెత్తు మాట అనడు. పైగా సందర్భం వచ్చిన ప్రతీసారి ఆయనపై ప్రత్యేకంగా ప్రేమ చాటుకుంటూనే ఉంటాడు.
నాగ్‌ను ఈసారి మరో కొత్త లుక్ లో ప్రెజెంట్ చేయడానికి వర్మ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన నాగ్ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రాగా.. ఇప్పుడు మరో లుక్ కూడా హల్ చల్ చేస్తోంది. నాగ్ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తున్న ఫోటో ఒకటి బయటకు రావడంతో.. వర్మ సినిమాలో ఇలాగే కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

Recommended