Skip to playerSkip to main contentSkip to footer
  • 12/15/2017
The Karnataka Rakshana Vedike Yuvasene have raised objection towards Leone performing at a private event scheduled for the New Years Eve in Bengaluru city.

2018 నూతన సంవత్సరం వేడుకల సందర్బంగా బెంగళూరులో జోరుగా నైట్ పార్టీలు జరుగుతాయి. బెంగళూరులోని ఎంజీ రోడ్డులో డిసెంబర్ 31వ తేదీ రాత్రి మొదలు అయ్యే నూతన సంవత్సర వేడుకలు మరుసటి రోజు వరకూ ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇప్పుడుసన్నీ లియోన్ తో ఓ ప్రైవేటు సంస్థ బెంగళూరులో న్యూఇయర్ సందర్బంగా సన్నీ హాట్ నైట్ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చెయ్యడంతో వివాదం మొదలైయ్యింది.
బెంగళూరు నగరంలోని అనేక స్టార్ హోటల్స్, రిసార్ట్స్, పబ్ లు, మాల్స్, పార్టీ ఫంక్షన్ హాల్స్ తదితర ప్రాంతాలు 2018 నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబు అవుతోంది. ఇదే సందర్బంలో బెంగళూరులో సన్నీహాట్ నైట్ పార్టీ ఏర్పాట్లకు రంగం సిద్దం చేశారు.
బెంగళూరు నగరంలోని ప్రసిద్ది చెందిన అనేక సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులను టార్గెట్ చేసుకుని సన్నీ హాట్ నైట్ న్యూ ఇయర్ పార్టీ ఏర్పాటు చేశారని తెలిసింది. బెంగళూరు నగరంలోని నాగవార సమీపంలోని మాన్యతా ఎంబాసి బిజినెస్ టెక్ పార్క్ లో డిసెంబర్ 31వ తేదీ సన్నీ హాట్ నైట్ పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

Category

🗞
News

Recommended