Skip to playerSkip to main contentSkip to footer
  • 11/7/2017
Bollywood actress Swara Bhaskar has recounted an incident that happened to her years ago. A film director repeatedly stalked her and subtly made several sexual advances for weeks during an outdoor shooting schedule.
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు సెక్సువల్ వేధింపులు ఎదుర్కొంటున్న అంశం తరచూ వింటూనే ఉన్నాం. హాలీవుడ్లో ప్రముఖ నిర్మాత హార్వీ వెయిన్‌స్టన్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత అలాంటి వ్యక్తుల వల్ల తాము ఎదుర్కొన్న సెక్సువల్ వేధింపుల గురించి పలువురు నటీమణులు ఓపెన్ అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తనకు ఎదురైన సెక్సువల్ వేధింపుల గురించి ఓ ఆంగ్లపత్రికతో పంచుకుంది. తాను సినిమా రంగానికి వచ్చిన కొత్తలో ఓ దర్శకుడి వల్ల ఎదుర్కొన్న సెక్సువల్ హరాస్మెంట్ గురించి ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే ఆ దర్శకుడి పేరు మాత్రం ఆమె బయట పెట్టలేదు.
కొన్ని సినిమా షూటింగ్స్ జరిగే సెట్స్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ పైస్థాయిలో ఉండేవారిలో ఫ్యూడల్ భావాలు ఉంటాయి. లైంగిక వేధింపులు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఇలాంటి విషయాల్లో బాధితులు నోరు మెదపకుండా ఉంటారన్న సంగతి అక్కడున్న అందరికీ తెలుసు.... అని స్వరభాస్కర్ చెప్పుకొచ్చారు.

Recommended