Skip to playerSkip to main contentSkip to footer
  • 2/19/2018
Four years after her last flick 'Mardaani', Rani Mukherji is making a comeback on the big screen with Hichki. Meanwhile On the talk show, Rani made some shocking confessions about her hubby Aditya Chopra that will leave your jaw dropped.


బాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రాణి ముఖర్జీ నాలుగేళ్ల క్రితం 'మర్దాని' చిత్రం చేశారు. యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రాతో పెళ్లి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆమె తాజాగా 'హిచ్కి' అనే చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. రాణి ముఖర్జీ ఇటీవల నేహా దూపియా హోస్ట్ చేస్తున్న చాట్ షో 'వోగ్ బిఎఫ్ఎఫ్ఎస్'లో తన ఫ్రెండ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ షోలో రాణి ముఖర్జీ తన భర్త ఆదిత్య చోప్రా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
‘నేను నటించిన సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. ఆ తర్వాత లక్కీగా ‘ముఝే దోస్తీ కరోగీ' అనే సినిమా చేశాను. ఆ సమయంలో ఆదిత్యను తొలిసారి ప్రొఫెషనల్‌గా కలిశాను' అని రాణి ముఖర్జీ తెలిపారు.
‘నేను వరుసగా చెత్త సినిమాలు చేయడంతో నన్ను తీసుకోవద్దని చాలా మంది ప్రెజర్ తెస్తున్నారని, నన్ను తీసుకోవడం యశ్ రాజ్ ఫిలింస్‌కు అంత మంచిది కాదని... పలువురు ఆదిత్యకు సూచించారని, ఆ విషయాన్ని ఆదిత్య నాతో మొహం మీదే చెప్పారు' అని రాణి ముఖర్జీ గుర్తు చేశారు.
‘కానీ ఆదిత్య నా టాలెంటు మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆయన తీస్తున్న సినిమాలో నేను అయితేనే సరిగ్గా సరిపోతాను అని నమ్మారు. అసలు విషయాన్ని ఆయన మొహం మీదే చెప్పేయడం నాకు చాలా నచ్చింది' అని రాణి ముఖర్జీ తెలిపారు.
మీ భర్తతో గొడవ పడతారా? అనే ప్రశ్నకు రాణి స్పందిస్తూ.... అవును, ప్రతి రోజూ మేము గొడవ పడతాం. ప్రతిసారి ఆయనకు శాపనార్థాలు పెడుతూనే ఉంటాను. నాకు నచ్చని పని చేసినప్పుడల్లా తిడుతూనే ఉంటాను. కానీ ఆయన ప్రేమ పూర్వకమైన పనులతో నన్ను మెప్పిస్తూ ఉంటారు... అని రాణి ముఖర్జీ తెలిపారు.

Recommended