MLA Venkat Rao Saved a Man Life by CPR : భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గుండెపోటుకు గురైన ఓ వ్యక్తి ప్రాణాలను సీపీఆర్ చేసి కాపాడారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీతారాముల కల్యాణ ఏర్పాట్లపై ఆర్డీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఏర్పాట్ల సమీక్ష సమావేశం అనంతరం సీనియర్ నాయకులు రసూల్ ఇంటికి వెళ్లారు. మంత్రి, ఎమ్మెల్యే వెంట ఉన్న వారిలో మాజీ మండల అధ్యక్షులు తోటమళ్ల సుధాకర్ అనే వ్యక్తి అకస్మాత్తుగా గుండెలో నొప్పి అంటూ పడిపోయారు.
Category
🗞
NewsTranscript
00:00Oh