• 2 weeks ago
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తో ఫైనల్లో తలపడే జట్టే ఏంటో ఖరారైపోయింది. ఐసీసీ ఈవెంట్స్ లో బ్యాడ్ లక్ కి బావమరుదులు అని చెప్పుకునే సౌతాఫ్రికా ఆటగాళ్లు మరోసారి నాకౌట్ మ్యాచ్ లో ఓడి ఇంటి దారి పట్టారు. లాహోర్ లో జరిగిన సెమీ ఫైనల్ 2 మ్యాచ్ లో కివీస్, సౌతాఫ్రికా జట్ల మధ్య హోరా హోరీ పోరు తప్పదని భావిస్తే...363 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక చతికిల పడిపోయింది సౌతాఫ్రికా. రీజన్ కివీస్ స్పిన్నర్, కెప్టెన్ మిచెల్ శాంట్నర్. 20పరుగులకే ర్యాన్ రికెల్టన్ అవుటైపోయినా క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ తెంబా బవూమానను, వ్యాన్ డర్ డుస్సెన్ ల జోరును అడ్డుకున్నాడు శాంట్నర్. బవుమా 56పరుగులు చేస్తే వ్యాన్ డర్ డుసెన్ 69 పరుగులు చేశాడు. అయితే వీళ్లద్దిరినీ అవుట్ చేసిన శాంట్నర్...అతి ప్రమాదకరమైన ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ వికెట్ కూడా తీసుకున్నాడు. అయితే డేవిడ్ మిల్లర్ లో మిడిల్ లో ఒంటరి పోరాటం చేశాడు. బౌలర్లను అడ్డం పెట్టుకుని ఒక్కడై అర్థశతకంతో విరుచుకు పడినా లక్ష్య చేధన చాలా దూరం ఉండటంతో మిల్లర్ ఏమీ చేయలేని పరిస్థితుల్లో సౌతాఫ్రికా మరోసారి ఐసీసీ నాకౌట్ మ్యాచులో ఓటమి పాలైంది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ లో విల్ యంగ్ త్వరగానే అవుటైనా రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ క్రీజులో పాతుకుపోయి సెంచరీలతో సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించారు. రచిన్ 108 పరుగులు చేస్తే. కేన్ మామ 102 పరుగులు చేశాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిఫ్స్ 27 బాల్స్ లోనే 49  పరుగులు చేయటంతో న్యూజిలాండ్ 363 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టింది. సో మొత్తం న్యూజిలాండ్ తో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ని తొమ్మిదో తారీఖును దుబాయ్ లో జరుగుతుంది.

Category

🗞
News

Recommended