• 3 weeks ago
Cancer Health Check Ups to People : విద్య, వైద్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశాలు. ఆరోగ్యవంతులైన మానవ వనరులు ఉన్నపుడే దేశ ఆర్థిక రథచక్రం ముందుకు సాగేది. అందుకే ప్రపంచంలోని అన్నిదేశాలు ఆరోగ్యరంగానికి అంత ప్రాధాన్యత ఇస్తాయి. మన దేశంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ఆరోగ్య పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తుంటాయి.

ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం 30 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారందరికీ సాంక్రమికేతర వ్యాధులు, సాధారణ క్యాన్సర్ల పరీక్షలను నిర్వహిస్తోంది. ప్రజలను ఆయా ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడం సహా దేశ ఆరోగ్య పరిరక్షణ విధానాలను సమూలంగా మార్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మరి ఎన్​సీడీలు దేశానికి విసురుతున్న సవాళ్లు ఏమిటి? వాటి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఎలాంటి ప్రయోజనాలు దక్కనున్నాయి. ఆరోగ్య భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది ఏ మేరకు దోహదం చేయనుంది?

Category

🗞
News

Recommended