Ayyanna on Jagan Opposition Status :ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా తనను ప్రకటించేలా ఆదేశించాలని కోర్టులో ఆయన పిటిషన్ వేశారని చెప్పారు. ఇందులో సభాపతిని, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చారని పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చేవరకు తాను వేచి చూద్దామని అనుకున్నట్లు వివరించారు. కానీ ఇటీవల కాలంలో జగన్, వైఎస్సార్సీపీ నేతల వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని వెల్లడించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా జగన్కు ప్రతిపక్ష హోదాపై సభలో స్పీకర్ ప్రకటన చేశారు.
Category
🗞
News