• 2 weeks ago
 ఎస్ టీమిండియా సాధించింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది భారత్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కి వెళ్లాలంటే ఆసీస్ ను ఓడించి తీరాల్సిన నాకౌట్ మ్యాచ్ లో కంగారూలను కమ్మేసింది టీమిండియా. ఆస్ట్రేలియా విసిరిన 265 పరుగుల లక్ష్య చేధనలో మచ్చల పులి విరాట్ కొహ్లీ మరోసారి చెలరేగిపోయాడు. రోహిత్ శర్మ పెద్ద స్కోరు చేయలేకపోయినా, గిల్ త్వరగానే అవుట్ అయినా శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తోడుగా ఛేజ్ మాస్టర్ కింగ్ కొహ్లీ రెచ్చిపోయాడు. ఓపికగా ఆడుతూ ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్ ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 98 బంతుల్లో 5 మాత్రమే కొట్టి 84 పరుగులు చేసిన విరాట్..జంపా బౌలింగ్ లో టెంప్ట్ అయ్యి క్యాచ్ ఇచ్చేశాడు కానీ లేదంటే ఈ ఛాంపియన్స్ వరుసగా రెండో శతకాన్ని నమోదు చేసేవాడు. కొహ్లీ అవుటైనా మిగిలిన పనిని కేఎల్ రాహుల్, పాండ్యా తో కలిసి పూర్తి చేశారు. చివర్లో పాండ్యా అవుటైనా భారత్ కొట్టాల్సిన లక్ష్యం అప్పటికే దాదాపుగా కంప్లీట్ అయిపోయింది.  ఆసీస్ బౌలర్లలో జంపా 2 వికెట్లు తీయటం మినహా మిగిలిన బౌలర్లంతా తేలిపోయారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు ఓ ఆటాడించారు. ఓపెనర్ కూపర్ కోన్లే ను డకౌట్ చేయటంతో పాటు ట్రావియెస్ హెడ్ ను పెద్ద స్కోరు చేయకుండా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వెనక్కి పంపించటంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయలేకపోయింది. తర్వాత స్మిత్, లోయర్ మిడిల్ ఆర్డర్ లో అలెక్స్ కేరీ అర్థ సెంచరీలు బాది ఆస్ట్రేలియాను ఆదుకున్నారు. మూడు వికెట్లు తీసిన షమీ మరోసారి తన ఎక్స్ పీరియన్స్ ను యూజ్ చేయగా...స్పిన్నర్లు నలుగురూ 5 ఎకానమీతో పరుగులను కట్టడి చేశారు. ఫలితంగా ఆస్ట్రేలియా స్కోరు బోర్డు పై 264పరుగులు మాత్రమే పెట్టి ఆలౌట్ అయ్యింది. ఈ అద్భుతమైన విజయంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరుకుంది భారత్. 2013 తర్వాత మరోసారి మినీ వరల్డ్ కప్ ను ముద్దాడే ఆఖరి సమరానికి సిద్ధమైంది. రేపు జరిగే మ్యాచ్ తో మన ప్రత్యర్థి న్యూజిలాండా...సౌతాఫ్రికానా తేలిపోనుంది.

Category

🗞
News

Recommended