• 2 weeks ago
 ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గుజరాత్ లో ని జామ్ నగర్ లో వంతారా ను ప్రారంభించారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ స్థాపించిన ఈ వంతారా ప్రపంచంలోనే అతిపెద్ద వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్. ఇక్కడ లక్షా 50వేలకు పైగా జంతువులను రెస్క్యూ చేసి పరిరక్షిస్తున్నారు. వైద్య సేవలను అందిస్తున్నారు. ప్రధాని మోదీ అంబానీ కుటుంబ సభ్యుల సమక్షంలో వంతారాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వంతారా మొత్తం కలియ తిరిగిన మోదీ..పులి పిల్లలకు పాలు తాగించారు. ఏసియాటిక్ సింహాలు, పులుల దగ్గర చాలా సేపు గడిపారు. ఇక్కడ జంతువులకు ఎలా వైద్య సేవలను అందిస్తున్నారో దగ్గరుండి తెలుసుకున్న మోదీ చాలా సేపు అటవీ జంతువులతో గడుపుతూ సేదతీరారు. ఈ వంతారా ఏర్పాటు కోసం అంబానీల కుటుంబం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనాధ జంతువులను ఏకం చేసింది. వాటిలో ఏనుగుల నుంచి అడవి పిల్లులు వరకూ అన్నీ ఉన్నాయి. 

Category

🗞
News

Recommended