19 నవంబర్ 2023 ఆ రోజు మనకు జరిగిన పరాభవం. హా హతవిధీ. ఎప్పటికీ మర్చిపోలేనిది. ఫైనల్ వరకూ ఇరగదీశాం. షమీ వికెట్ల వేట...రోహిత్ శర్మ సెల్ఫ్ లెస్ ఇన్నింగ్స్...విరాట్ ఫామ్ లోకి వచ్చిన ఆనందం..లక్షా 30వేల భారత అభిమానులు సాక్షిగా..ఓ సైలెన్సర్ మనల్ని సైలెంట్ చేశాడు. అది చాలదన్నట్లు ఓ హెడ్ మాస్టర్ మన పెట్టిన లక్ష్యాన్ని హల్వా పూరీలా ఊదేశాడు. రిజల్ట్ మన వరల్డ్ కప్ కల చెదిరిపోయింది. 2011 తర్వాత మళ్లీ మనదే వరల్డ్ కప్ అని బలంగా ఫిక్స్ అయిపోయిన అభిమానులను ఆ రోజు ట్రావియెస్ హెడ్, ప్యాట్ కమిన్స్ సైలెంట్ చేస్తే...రెండేళ్ల తర్వాత అంత కాకపోయినా అంతకంత పగ తీర్చుకోవటానికి మనోళ్లకు అవకాశం వచ్చింది. మినీ వరల్డ్ కప్ అని పిలుచుకునే ఛాంపియన్స్ ట్రోఫీ లో సెమీ ఫైనల్లో ఈ రోజు మళ్లీ ఇండియా, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఓడిన వాడు ఇంటికి గెలిచిన వాడు ఫైనల్ కి. సో డూ ఆర్ డై లాంటి ఈ మ్యాచ్ లో మనోళ్లు ఏం చేస్తారనే టెన్షన్...శర్మ గారి సైన్యం కచ్చితంగా బదులు తీర్చుకోవాలనే కసి ఈ సారి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇండియన్స్ ఫ్యాన్స్ లో. 2011 వన్డే వరల్డ్ కప్ లో ఇలానే టీమిండియా సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు వెళ్లిన అక్కడ లంకకు షాక్ ఇచ్చి వరల్డ్ కప్ గెలుచుకుంది. అచ్చం అలానే ఈసారి కూడా ఛాన్స్ వచ్చింది. మళ్లీ సెమీస్ లో ఆస్ట్రేలియాను ఓడిస్తే...ఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ల్లో ఓ టీమ్ ను ఢీకొట్టి మినీ వరల్డ్ కప్ ను కొట్టేసే ఛాన్స్ వచ్చింది. మరి దుబాయ్ మన దొరబాబులు ఏం చేస్తారో చూడాలి.
Category
🗞
News