కేంద్ర మంత్రి రక్షా ఖద్సే కుమార్తెను ఓ పబ్లిక్ ఈవెంట్‌లో పోకిరీలు వేధించారు. దీనిపై మంత్రి స్వయంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. పబ్లిక్ ప్లేసుల్లో పోకిరీలు రెచ్చిపోతుండటం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే ఏకంగా కేంద్ర మంత్రి కుమార్తెను వేధించిన ఘటన మహరాష్ట్రలోని జల్‌గావ్ లో జరిగింది. యువజన వ్యవహారాలు, స్పోర్ట్స్ కేంద్ర సహాయమంత్రి రక్షా ఖద్సే కుమార్తె జలగావ్‌లోని ఓ గ్రామ జాతరకు వెళ్లినప్పుడు ఆమెను టీజింగ్ చేశారు. తన కుమార్తెపై వేధింపులకు పాల్పడిన వారిపై కేంద్రమంత్రి రక్షా స్వయంగా ఫిర్యాదు చేశారు.తన కుమార్తెపై వేధింపులకు పాల్పడిన వారిపై కేంద్రమంత్రి రక్షా స్వయంగా ఫిర్యాదు చేశారు. జలగావ్‌లోని ముక్తై నగర్ పరిధిలోని కొథాలి గ్రామంలో సంత్ ముక్తై యాత్రలో పాల్గొనేందుకు మంత్రి కుమార్తె, ఆమె స్నేహితురాళ్లు వెళ్లారు. ఈ జాతరలో కొంతమంది పోకిరీలు మంత్రి కుమార్తెను కామెంట్లతో వేధించారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో గుజరాత్‌లో ఉన్న మంత్రి ఘటన గురించి తెలిసిన వెంటనే ముక్తై నగర్‌కు వచ్చారు. స్వయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎఫ్.ఐఆర్‌లో ఏడుగురు పేర్లను చేర్చిన పోలీసులు ఇప్పటివరకూ ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కుమార్తె మైనర్ కావడంతో నిందితులపై భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్లతో పాటు Protection of Children from Sexual Offences (POCSO) Act, అలాగే వారి అనుమతి లేకుండ ఫోటోలు, వీడియోలు తీసినందుకు ITయాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు.
Category
🗞
News