• 2 weeks ago
కర్ణాటక శాసనసభ స్పీకర్ కార్యాలయం నుండి శాసనసభ్యుల సభలో ఎమ్మెల్యేల గదులకు స్మార్ట్ లాక్‌లను ఏర్పాటు చేయడానికి రూ. 3 కోట్లను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై చర్చించి కావాల్సిన వసతులపై ఒక నిర్ణయానికి వస్తామని అంటున్నారు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఖాదర్ ఫరీద్. అసెంబ్లీలో ప్రజల కోసం మాట్లాడి ఎమ్మెల్యేలు అలిసిపోతున్నారట. జనం  కోసం వాదించి, కొట్లాడుతుంటే వాళ్లకి రెస్ట్ కావాలి కదా అని అంటున్నారు ఒక సీనియర్ నాయకుడు. అది ఎక్కడో కాదు. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో. అసెంబ్లీ లో మాట్లాడి మాట్లాడి మేము అలిసిపోతున్నాము. విశ్రాంతి కోసం మాకు మసాజ్ ఛైర్లు, reclinerలు కావాలి అని అడుగుతున్నారు. అంతే కాదు సెక్యూరిటీ కోసం స్మార్ట్ లాక్ కూడా ఇస్తే బాగుంటుందని అంటున్నారు. అసలు కథ ఏంటంటే కర్ణాటక శాసనసభ స్పీకర్ కార్యాలయం నుండి శాసనసభ్యుల సభలో ఎమ్మెల్యేల గదులకు స్మార్ట్ లాక్‌లను ఏర్పాటు చేయడానికి రూ. 3 కోట్లను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై చర్చించి కావాల్సిన వసతులపై ఒక నిర్ణయానికి వస్తామని అంటున్నారు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఖాదర్ ఫరీద్. 

Category

🗞
News

Recommended