• 17 hours ago
YS Jagan Shares in Saraswati Power: సరస్వతి పవర్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వాటాల బదలాయింపులో షర్మిలను అనవసరంగా లాగుతున్నారని వైఎస్ విజయమ్మ అన్నారు. జగన్‌, భారతి రెడ్డి ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) హైదరాబాద్‌ బెంచ్‌కు నివేదించారు. సరస్వతి వాటాలపై సర్వహక్కులూ తనవేనన్న విజయమ్మ, జగన్‌, షర్మిల ఆస్తి వివాదాలతో తనను కోర్టులో నిలబెట్టారని పేర్కొన్నారు. పిల్లల మధ్య వివాదంతో ఏ తల్లీ కోరుకోని విధంగా నిస్సహాయంగా కోర్టులో నిలబడాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇంత ఆవేదనకు గురిచేయడం జగన్‌, భారతిరెడ్డికి సరికాదన్నారు.

Category

🗞
News

Recommended