Durga Malleswara Swamy Rathotsavam : విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల రథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఆది దంపతులకు బుధవారం రాత్రి లింగోద్భవ కాలంలో కల్యాణం నిర్వహించారు. ఈరోజు నగరోత్సవంలో భాగంగా రథోత్సవాన్ని జరిపించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కొబ్బరికాయ కొట్టి దీనిని ప్రారంభించారు. వేద మంత్రాలు, మేళతాళాలు, కళా ప్రదర్శనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. భక్త జనసందోహంతో ఊరేగింపు కోలాహలంగా సాగింది.
Category
🗞
News