New Amberpet Flyover Opened For Motorists : అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ పై నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. స్థానిక పార్లమెంట్ సభ్యుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశంతో అంబర్‌పేట్ ఫ్లైఓవర్ పై రాకపోకలు ఇవాళ ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. దాదాపుగా ఫ్లై ఓవర్ పనులు పూర్తయ్యాయి. అయితే కింద భాగాన రోడ్డు నిర్మాణం, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలను పూర్తి చేసి అధికారికంగా మరికొన్ని రోజుల్లో ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు. అంతవరకు ప్రయాణికుల సౌకర్యార్థం శివరాత్రి నుంచి ఈ బ్రిడ్జ్ పై రాకపోకలను అనుమతించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Category
🗞
News