Skip to playerSkip to main contentSkip to footer
  • 11/28/2024
YCP Leader Vamsidhar Reddy Photoshoot In Tirumala : తిరుమల శ్రీవారి ఆలయం ముందు వైఎస్సార్ జిల్లా కమలాపురం వైఎస్సార్సీపీ నేత, మైనింగ్ వ్యాపారి వంశీధర్ రెడ్డి హల్‌చల్‌ చేశాడు. నలుగురు వ్యక్తిగత ఫొటోగ్రాఫర్లలో ఆలయ ప్రాంగణంలో ఫొటోషూట్‌ నిర్వహించారు. ఇంత జరుగుతున్నా టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది పట్టించుకోలేదు. వంశీధర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఫోటో షూట్ చేయించుకోవడం విమర్శలకు దారితీసింది. వంశీధర్‌రెడ్డి బంధుమిత్రులతో కలిసి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Category

🗞
News

Recommended