Skip to playerSkip to main contentSkip to footer
  • 7/18/2018
రణబీర్ కపూర్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన 'సంజు' ఇండియన్ బాక్సాఫీసు వద్ద రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు రాబడుతోంది. తొలి రెండు వారాల్లో ఈ బయోపిక్ వసూళ్లు ఇండియన్ మార్కెట్లో రూ. 300 కోట్లకు చేరువైంది. ఈ చిత్రం లైఫ్‌టైమ్ రన్‌లో బజరంగీ భాయిజాన్, పద్మావత్, సుల్తాన్ కలెక్షన్ రికార్డులను తుడిపెట్టడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
తొలి వారం రూ. 202.51 కోట్లు వసూలవ్వగా... రెండో వారంలో రూ. 91.22 కోట్లు రాబట్టింది. దీంతో ఇండియా మార్కెట్లో తొలి 14 రోజుల్లో నెట్ టోటల్ రూ. 293.73 కోట్లకు చేరుకుంది. టోటల్ గ్రాస్ రూ. 376.58 వసూలైనట్లు సమాచారం.

Recommended