Skip to playerSkip to main contentSkip to footer
  • 5/5/2018
After scoring back to back hits consecutively with Temper, Nannaku Prematho, Janatha Garage and Jai Lava Kusa, Young Tiger NTR will be teaming up with ace directorTrivikram Sriniva. Regular shooting of this film started.
#NTR
#TrivikramSrinivas

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రకటించిన రోజు నుంచే ఈ ప్రాజెక్ట్ పై భారి అంచనాలు ఉన్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తి అయ్యింది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఈ షెడ్యూల్ లో చిత్రీకరించడం జరిగింది. రామ్,లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో ఈ సీన్స్ షూట్ చేసారు.
సంగీత దర్శకుడు తమన్ సంగీతం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంభందించిన సాంగ్స్ రీరికార్డింగ్ మొదలయ్యింది. మే రెండోవారం నుండి ఈ చిత్ర రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ మూవీలో కొత్త లుక్ కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఓ ట్రైనర్‌ను ఏర్పాటు చేసుకుని మరీ కొత్త లుక్ కోసం ట్రై చేశారు.
ఈ సినిమా పొలిటికల్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో మరో ‘ఆది' అవుతుందని అంటున్నారు. సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాఫ్ లో నడిచే ఈ సినిమా లో త్రివిక్రమ్ స్టైల్ పంచ్ డైలాగ్స్ ఉండబోతున్నయంట.
తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు రచయిత పెంచల్ దాస్ త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో మాటలు రాస్తున్నాడని సమాచారం. పెంచల్ దాస్ నాని నటించిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో ''దారి చూడు మామా'' పాటను రాసి పాడడం జరిగింది. పెంచల్ దాస్ చిత్తూరు వాసి కావున రాయలసీమ భాష బాగా తెలిసినవాడు కనుక ఈ సినిమాలో డైలాగ్స్ పెంచల్ దాస్ తో రాయిస్తున్నాడంట త్రివిక్రమ్. మొదటిసారి త్రివిక్రమ్ తన సినిమాకు వేరే రైటర్ తో వర్క్ చేస్తున్నాడు.

Recommended