Skip to playerSkip to main contentSkip to footer
  • 1/11/2018
Srija family offered prayers at Bhadradri Sri Seetharamachandra Swamy Temple for Jana Sena chief Pawan Kalyan.

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఆయన అభిమాని శ్రీజ, ఆమె కుటుంబ సభ్యులు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం వారు స్వామివారికి పూజలు చేశారు. పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంతో పాటు, ఆయన నటించిన అజ్ఞాతవాసి సినిమా విజయాన్ని కాంక్షిస్తూ వారు పూజలు నిర్వహించారు. పాల్వంచకు చెందిన బండి నాగయ్య, ఆయన కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ గోత్రనామాల పేరిట పూజ చేశారు. ఈ సందర్భంగా బండి నాగయ్య విలేకరులతో మాట్లాడారు. ఈయన శ్రీజ తండ్రి. తమ పాప శ్రీజ 2014 సెప్టెంబర్‌లో బ్రెయిన్ ఫీవర్‌తో బాధపడుతూ క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఖమ్మం వచ్చి చికిత్స పొందుతున్న తమ పాపను పరామర్శించారని గుర్తు చేసుకున్నారు.పవన్ కళ్యాణ్ రాకతో తమ పాపకు పునర్జన్మ లభించిందని బండి నాగయ్య అన్నారు. తమ పాపకు పునర్జన్మ ప్రసాదించిన పవన్ కళ్యాణ్ తమకు దేవుడు అని, ఆ దేవుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని చెప్పారు.

Category

🗞
News

Recommended