Skip to playerSkip to main contentSkip to footer
  • 1/10/2018
South Indian actress Nitya Menon, who was last seen in Vijay's movie Mersal will now play the role of a lesbian in her upcoming film.

స్కిన్ 'షో'కి నిత్యా మీనన్ ఆమడ దూరం. అదొక్కటే కాదు.. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే నిర్మొహమాటంగా 'నో' చెప్పేస్తారు. అలా చాలా అవకాశాలను వదలుకున్నారు కూడా. అదే సమయంలో పాత్ర నచ్చాలే కానీ 'బోల్డ్' క్యారెక్టర్స్‌కు కూడా ఆమె ఓకె చెప్పేస్తారు. త్వరలో రాబోతున్న ఓ సినిమాలో వైవిధ్యభరితమైన పాత్రతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట..
నిత్యా మీనన్ చేస్తున్న ఓ సినిమాలో ఆమె స్వలింగ సంపర్కురాలి పాత్రలో కనిపించనున్నారట. పాత్ర డిమాండ్ మేరకు మరో హీరోయిన్‌తో నిత్యా మీనన్ లిప్ లాక్ కూడా చేసిందట.
ఎప్పుడూ హద్దులు దాటని పాత్రలనే ఎంచుకునే నిత్యా మీనన్.. ఇప్పుడిలా 'లిప్ కిస్'లకు ఓకె చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ నిత్యా లిప్ లాక్ చేసిన హీరోయిన్ ఎవరా? అని చాలామంది ఆరా తీయడం మొదలుపెట్టారు.
నిత్య ఏ హీరోయిన్ తో లిప్ లాక్ చేసిందన్న సంగతి పక్కనపెడితే.. అసలే సినిమాలో ఆమె లెస్బియన్(స్వలింగ సంపర్కురాలు) పాత్రలో నటించబోతున్నారన్న దానిపై క్లారిటీ లేదు.
ప్రస్తుతం నిత్యా మీనన్ నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న 'అ..'లో నటిస్తోంది. ఇందులో రెజీనా, కాజల్‌లు కూడా నటిస్తున్నారు. బహుశా ఈ సినిమాలోనే నిత్యా ఆ పాత్రలో కనిపించబోతున్నారా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Recommended